ఖమ్మం కార్పొరేషన్ కంటే ఇల్లందు నియోజకవర్గంలో ఎక్కువగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇల్లందు పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఇల్లందులో నిర్మించిన మరుగుదొడ్లు, సీసీరోడ్లను ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తా: పువ్వాడ - telangana transport minister puvvada ajay kumar
ఇల్లందు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న పురపాలక మంత్రి కేటీఆర్.. ఆ బాధ్యత నాకు అప్పజెప్పారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇల్లందుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇల్లందు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న పురపాలక మంత్రి కేటీఆర్.. ఆ బాధ్యత నాకు అప్పజెప్పారని పువ్వాడ తెలిపారు. ఇల్లందుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో బస్ డిపోకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని, ఐదు నెలల్లో డిపోను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ, ఎంపీ కవితల సాయంతో ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు.