భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో తెరాస పార్టీ పైచేయిగా నిలిచిందని.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తప్పకుండా తెరాసనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తామని.. రైతు బంధు పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. ఎంపీల వేటుపై అట్టుడికిన పెద్దల సభ