తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR RESPOND: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... ఆ చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం - ట్విట్టర్‌ వినతికి మంత్రి స్పందన

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. చిన్నారుల దీనస్థితిపై కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా స్థానికులు సమాచారం అందించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి బాధితులకు అండగా ఉండాలంటూ ఎమ్మెల్యే, కలెక్టర్‌కు సూచించారు. చిన్నారుల భవిష్యత్‌ బాధ్యతను తానే తీసుకుంటానని ఎమ్మెల్యే హరిప్రియ హామీ ఇచ్చారు.

Minister KTR Responded on Two children
ఇద్దరు చిన్నారులతో ఎమ్మెల్యే హరిప్రియ

By

Published : Jun 10, 2021, 4:50 PM IST

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులపై ఈనాడులో వచ్చిన కథనానికి మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కేటీఆర్ ఆదేశాలతో చిన్నారుల ఇంటికి వెళ్లిన
ఎమ్మెల్యే హరిప్రియ వారిచదువు, భవిష్యత్‌ బాధ్యత తీసుకోవడం సహా రెండు పడకల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన గణేశ్‌, స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫోటోగ్రాఫర్​గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గణేశ్‌... 2018లో గొంతు క్యాన్సర్‌తో చనిపోవడంతో భారమంతా స్రవంతిపై పడింది. ఆ తర్వాత ఆమె కూడా కిడ్నీ సమస్యతో అనారోగ్యానికి గురై చనిపోయింది. తల్లిదండ్రుల మృతితో వారిద్దరి చిన్నారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు... వృద్ధులైన అమ్మమ్మ, తాతయ్యలు సంరక్షణలో ఉన్నారు.

చిన్నారుల పరిస్థితిపై ఈనాడులో వచ్చిన కథనాన్ని చూసిన స్థానికులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్​కు సూచించారు. మంత్రి ఆదేశాలతో చిన్నారుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే హరిప్రియ ప్రభుత్వం తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పిల్లల చదువు, భవిష్యత్‌ బాధ్యతతో పాటు రెండు పడకల ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:KTR:'క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి'

ABOUT THE AUTHOR

...view details