భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ఆలయంలోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ శాంతి సంపదలతో ఉండాలని రామయ్యను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
భద్రాద్రి రాములోరి సన్నిధిలో ఆరోగ్య మంత్రి ఈటల - sitharamaswamy
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భద్రాద్రి సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఆశీర్వచనం అందుకుంటున్న మంత్రి
Last Updated : Sep 11, 2019, 2:13 PM IST