తెలంగాణ

telangana

ETV Bharat / state

విఫలమైన రైతులు, వ్యాపారుల మధ్య చర్చలు - bhadradri kothagudem district

భద్రాద్రి జిల్లా ఇల్లందులో మొక్కజొన్న రేట్లపై రైతులు, వ్యాపారుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సీసీఐ ఇచ్చిన ధరకే మెుక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు కోరగా... వ్యాపారస్థులు ఇవ్వలేమనడం వల్ల అన్నదాతలు అంగీకరించలేదు.

meeting between farmers and merchants failed in bhadradri kothagudem district
విఫలమైన రైతులు, వ్యాపారుల మధ్య చర్చలు

By

Published : Apr 26, 2020, 11:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో మొక్కజొన్న రేట్లపై రైతులు, వ్యాపారుల మధ్య న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు ఆవునూరి మధు ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సీసీఐ ద్వారా మొక్కజొన్న క్వింటాలుకు 1760 రూపాయలకు కొనుగోలు జరుగుతున్నందున వ్యాపారస్తులు కూడా ఆ రేటు ఇచ్చి కొనుగోలు చేయాలని రైతుల తరపున న్యూడెమోక్రసీ నాయకులు కోరారు. కానీ రైతులు ఇప్పటికే 1670 రూపాయల రేటు గతంలో అంగీకారం జరిగిందని సీసీఐ రేట్లు ఇవ్వలేమని వ్యాపారస్తులు తెలిపారు.
వ్యాపారులు చెప్పిన ధరకు రైతులు అంగీకరించకపోవడం వల్ల చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలలో కొమరారం, పోలారం, మర్రిగూడెం, మాణిక్యారం పంచాయతీల రైతు ప్రతినిధులు, న్యూ డెమోక్రసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details