తెలంగాణ

telangana

ETV Bharat / state

మణుగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి - Man Died By Thunderbolt

పిడుగుపాటుకు గురై.. వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటు చేసుకుంది. మండలంలోని సాంబయ్యగూడెం ఇసుక క్వారీ వద్ద పని చేస్తున్న కుమారస్వామిపై పిడుగు పడటం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారస్వామి చనిపోవడం వల్ల ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది.

Man Died By Thunderbolt Effect In Khammam Manuguru
మణుగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

By

Published : May 18, 2020, 10:25 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని సాంబయ్యగూడెంలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్​ మీద పనిచేసే కుమారస్వామి ఎప్పటిలాగే.. సాంబయ్యగూడెం ఇసుక క్వారీ వద్ద టిప్పర్​లో ఇసుక నింపి మరో ఇద్దరితో కలిసి పరదా కప్పుతున్నారు. అదే సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావటం.. కుమారస్వామి మీద పిడుగు పడడం వల్ల కుమారస్వామి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కైన కుమారస్వామి మరణం వల్ల ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. కుమారస్వామి కుటుంబానికి తెరాస, సీపీఐ మండల నాయకులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ఇవీ చూడండి:'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details