భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కాలపురం గ్రామంలో ఐదుచోట్ల మావోయిస్టుల గోడ పత్రికలు వెలిశాయి. గ్రామంలో ఇసుక దందా అరికట్టాలని, పీడిత ప్రజలపై బడా వ్యాపారుల ఆగడాలు ఆపాలని రాసి ఉంది. ఏజెన్సీ చట్టాలు పటిష్టం చేయాలని, గ్రామంలో పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్లతో పోస్టర్లు అతికించారు.
పోలీసుల ఆరా
పోస్టర్ల కలకలం - పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు గోడపత్రికలు కలకలం సృష్టించాయి. ఇసుక దందా అరికట్టాలని, ఏజెన్సీ చట్టాలు పటిష్టం చేయాలని ప్రచురించారు.
మావోయిస్టు పోస్టర్లు
సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇది చేసింది మావోయిస్టులా లేక ఇంకెవరైనా చేశారా అని దర్యాప్తు జరుపుతున్నారు. మణుగూరులో వరుసగా వెలుస్తున్న పోస్టర్లతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోయిస్టులు ఇటీవల కాలంలో గోదావరి నది దాటి రెండు సార్లు మణుగూరులో సంచరించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇవీ చూడండి:యశ్వంత్‌పూర్ ఎక్స్ప్రెస్లో మంటలు