తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2020, 8:19 PM IST

ETV Bharat / state

భద్రాచలంలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

భద్రాచలంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఏఎస్‌పీ రాజేష్‌ చంద్ర తెలిపారు.

lockdown in bhadrachalam in bhadradri kothagudem district
భద్రాచలంలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాల్లో ప్రజలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్‌పీ రాజేష్‌ చంద్ర తెలిపారు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం7 వరకు ప్రతిరోజు 144 సెక్షన్ అమలులో ఉంటదని... అతిక్రమిస్తే కఠినం చర్యలు తీసుకుంటామని అన్నారు. నిన్నటి నుంచి ఈరోజు వరకు సుమారు వంద ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

ఉదయం నుంచి రాత్రి వరకు ప్రధాన రహదారిపైనే ఉంటూ... వైరస్‌ వ్వాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలపై కనపడ కూడదని ఆదేశించారు.

భద్రాచలంలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

ఇదీ చూడండి:రూ.2కే కిలో గోధుమలు- ఒప్పంద ఉద్యోగులకు వేతనం

ABOUT THE AUTHOR

...view details