KTR Chit Chat In Telangana Election Campaign 2023 : రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) యువత, మహిళలు, మైనార్టీలు సహా అన్ని వర్గాల వారు తమ వైపే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో 80కి పైగా సీట్లతో బీఆర్ఎస్ (BRS)మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ హవా అనేది ఉట్టి ప్రచారం మాత్రమే అన్న ఆయన.. అదంతా సామాజిక మాధ్యమాల్లో మాత్రమే సాధ్యం అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు ప్రజల నుంచి పూర్తి మద్ధతు ఉందన్న కేటీఆర్.. ఆలోచించే ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలు పెట్టేది భూమాత కాదు భూ'మేత' - ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యమే : సీఎం కేసీఆర్
KTR Fires On Revanth Reddy : ఆరెస్సెస్ మూలాలు ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీజేపీ సిద్ధాంతాలను.. కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోదీ గురించి రేవంత్ ఒక్కరోజు కూడా ఎందుకు విమర్శలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే అని కేటీఆర్ తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. ఇప్పటికే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని, వెబ్ సైట్లో అన్ని వివరాలు పొందుపరిచినట్లు వివరించారు. హామీలో ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. యువతకు తమ పట్ల విశ్వాసం ఉందని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తామని అన్నారు.