భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి నది కార్తీక దీపాలతో వెలుగులీనుతోంది. కార్తీక రెండో సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి... గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం దీపారాధన చేశారు. గోదావరి ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ దీపాలను వెలిగిస్తున్నారు.
భద్రాచలంలో శోభాయమానంగా కార్తీక కాంతులు - భద్రాచలం లేటెస్ట్ న్యూస్
కార్తీక మాసం రెండో సోమవారంతో భద్రాచలంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కార్తీక దీపాలను వదులుతున్నారు.
భద్రాచలంలో శోభాయమానంగా కార్తీక కాంతులు
కార్తీక మాసంలోని సోమవారానికి ప్రత్యేకత ఉన్నందున... పుణ్య స్నానాలు ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి... భద్రాచలం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయంలో భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం