తెలంగాణ

telangana

ETV Bharat / state

jwalaa thorana mahothsavam: కార్తీక పౌర్ణమి ప్రత్యేకం.. కన్నుల పండువగా జ్వాలాతోరణ మహోత్సవం - కార్తీక పౌర్ణమి

రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పలు శివాలయాల్లో జ్వాలాతోరణం మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలంలోని ఓ ఆలయంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొని ఈ వేడుకను తిలకించారు.

jwalaa thorana mahothsavam
జ్వాలాతోరణ మహోత్సవం

By

Published : Nov 18, 2021, 10:42 PM IST

జ్వాలాతోరణ మహోత్సవం

రేపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం నుంచే ఆలయాల్లో భక్తుల సందడి పెరిగింది. కార్తీక దీపాలను వెలిగించేందుకు అధిక సంఖ్యలో మహిళలు ఆలయాల వద్దకు తరలి వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ఆలయంలో నిర్వహించిన జ్వాలాతోరణ మహోత్సవం అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసింది. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కనుల విందుగా జ్వాలాతోరణ మహోత్సవం

ఆలయం ఎదురుగా రెండు కర్రలను నిలువుగా పాతి ఒక కర్రను అడ్డంగా కడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త వరి గడ్డి తీసుకువచ్చి చుడతారు. దీనినే యమద్వారం అంటారని అర్చకులు చెబుతున్నారు. ఈ గడ్డి నిర్మాణంపై నెయ్యి వేసిన కర్రతో మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతి సమేత పరమేశ్వరుని వాహనాన్ని మూడు సార్లు అటు ఇటు ఊరేగిస్తారు. అనంతరం ఆ మంట కింద నుంచి భక్తులు అటు ఇటు తిరుగుతూ స్వామివారిని తిప్పుతారు. తద్వారా పల్లకిలో స్వామి వారు తిరిగే జ్వాలాతోరణం మహోత్సవాన్ని తిలకిస్తే భక్తులకు స్వర్గలోక ప్రవేశం కలుగుతుందని నమ్ముతారని అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

thousand pillar temple news: వేయి స్తంభాల ఆలయంలో కార్తిక మాసోత్సవాలు

Karthika masam 2021: కార్తిక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details