తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందు గనుల్లో పర్యావరణపై జీఎం సమీక్ష

గనుల్లో పర్యావరణంపై ఇల్లందు సింగరేణి జనరల్​ మేనేజర్​ సత్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో ఉపరితల గనుల్లో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై గనులు, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో జీఎం సత్యనారాయణ చర్చించారు.

By

Published : Jul 28, 2020, 7:48 AM IST

Illandu singareni gm meeting with environment officers
ఇల్లందు గనుల్లో పర్యావరణపై జీఎం సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని సింగరేణి గనుల్లో పర్యావరణ పరిస్థితులపై సింగరేణి జనరల్​ మేనేజర్ సత్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇల్లందు సింగరేణి ఏరియాలో ఉపరితల గనుల్లో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపరితల గనుల్లో పర్యావరణం పరిరక్షణకు పక్కాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గనులలో అనుమతి పొందిన ప్రదేశాలలో అమలవుతున్న విధానాలు, ఉపరితల గనులలో ఉత్పత్తికి ఆటంకం లేకుండా నీటిని తీసే విధానం, అటవీ అనుమతులు, ఉపరితల గని నిర్వాసితులకు అందించాల్సిన సౌకర్యాలకు సంబంధించిన వివరాలు సింగరేణి పర్యావరణ అధికారి సైదులు జీఎంకు, ఇతర అధికారులకు వివరించారు.

బొగ్గు వెలికితీత కొరకు పర్యావరణపరంగా ఇచ్చిన అనుమతులకు అనుగుణంగానే బొగ్గు ఉత్పత్తి చేయాలని, పర్యావరణానికి ఆటంకం లేకుండా తగు చర్యలను పాటించాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఓటూ జీఎం బండి వెంకటయ్య, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసు, జానకిరామ్, ప్రాజెక్ట్ అధికారులు బొల్లం వెంకటేశ్వర్లు, మల్లయ్య, రవికుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details