ప్రజలంతా రాబోయే వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెంలోని పేదలకు.. దోమతెరలు (mosquito nets) పంపిణీ చేశారు.
దోమతెరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ - వర్షాకాలంలో వ్యాధులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెంలో ఎమ్మెల్యే హరిప్రియ దోమతెరలు (mosquito nets) పంపిణీ చేశారు. రాబోయే వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
distribution of mosquito nets
ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దోమల వ్యాప్తిని అరికట్టాలని కోరారు. మలేరియా నివారణకు ప్రభుత్వం అందిస్తోన్న దోమతెరలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
ఇదీ చదవండి:'వారికి ఇప్పుడు టీకా అవసరం లేదు'