తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంట్రాక్ట్ కార్మికులకు మాస్కులు అందచేసిన ఐఎఫ్​టీయూ నేతలు - LOCK DOWN EFFECTS

ఇల్లందు పరిధిలోని సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులకు ఐఎఫ్​టీయూ నేతలు మాస్కులు అందజేశారు. సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని నేతలు డిమాండ్​ చేశారు.

FTU LEADERS DISTRIBUTED MASKS TO CONTRACT EMPLOYEES
కాంట్రాక్ట్ కార్మికులకు మాస్కులు అందచేసిన ఐఎఫ్​టీయూ నేతలు

By

Published : Apr 24, 2020, 12:38 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. జేకే కాలనీ, 24 ఏరియా సివిల్ విభాగం, నీటి సరఫరా సులభ్​ ఏరియా పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందజేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరించట్లేదని ఐఎఫ్​టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లాభాల వాటాలో వివక్షత చూపకుండా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలన్నారు. మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సారంగపాణి, బ్రాంచ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కాంట్రాక్ట్ కార్మికులకు మాస్కులు అందచేసిన ఐఎఫ్​టీయూ నేతలు
కాంట్రాక్ట్ కార్మికులకు మాస్కులు అందచేసిన ఐఎఫ్​టీయూ నేతలు

ఇదీ చూడండి:కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

ABOUT THE AUTHOR

...view details