భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చివరి రోజు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం సతీసమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన జంధ్యాలను స్వామి వారికి ధరింపచేశారు. హైగ్రీవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉపాలయంలోని హయగ్రీవానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వేద పండితులు వేదమంత్రాలు చదవగా.. అర్చకులు దూప దీప నైవేద్యాలు సమర్పించారు. రేపటి నుంచి నిత్య కల్యాణాలు పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో రమేశ్ బాబు తెలిపారు.
భద్రాద్రిలో హైగ్రీవ జయంతి వేడుకలు - bhadradri
భద్రాద్రిలో హైగ్రీవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చివరి రోజు పవిత్రోత్సవాలు నిర్వహించారు.
హైగ్రీవ జయంతి వేడుకలు