భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోటిలింగాల అడ్డరోడ్డు వద్ద ఓ దివ్యాంగుని ఆత్మవిశ్వాసం ముందు అతని అవిటితనం చిన్నబోయింది. తన వైకల్యానికి బాధపడకుండా..మొక్కజొన్న కంకులు కాల్చి వాటిని అమ్ముకుని మన్మథచారి జీవనం సాగిస్తున్నాడు. రోజు ఇల్లందు పట్టణానికి వెళ్లి మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసుకుని... వాటితో వచ్చే ఆదాయంతో కాలం వెల్లబుచ్చుతున్నాడు.
అంగవైకల్యం శరీరానికి.. ఆత్మవిశ్వాసానికి కాదు! - handicapped doing job at illandu
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల అడ్డరోడ్డు వద్ద మన్మథచారి అనే దివ్యాంగుడు.. తన వైకల్యానికి బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నిత్యం ఇల్లందు వెళ్లి మొక్కజొన్న కంకులు కాల్చుతూ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.
అంగవైకల్యం శరీరానికి.. ఆత్మవిశ్వాసానికి కాదు!
సీజన్ లేనప్పుడు వేసవికాలంలో తన మూడు చక్రాల సైకిల్‌పై ఐసు విక్రయిస్తూ ఉంటాడు. ఇలా సీజన్‌ను బట్టి తనకు సాధ్యమైన పనులు చేసుకుంటానని మన్మథచారి తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తనకు ఉపాధి అవకాశం కల్పించి.. ఉండేందుకు ఇల్లు ఇప్పించాలని కోరుతున్నారు.