భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో 41 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. స్నాన ఘట్టాల వద్ద మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగిపోయాయి. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున రావడం వల్ల నీటి మట్టం పెరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు..
రామయ్య చెంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదారమ్మ
భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..ఉన్నతాధికారులు సూచించారు.
నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Last Updated : Aug 16, 2019, 1:03 PM IST