భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. శనివారం 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాద హెచ్చరిక దాటిన గోదావరి నీటిమట్టం.. సాయంత్రానికి 46 అడుగులకు పెరిగింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 48 అడుగులకు పెరిగితే.. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలంలో వరద నీరు పెరగడం వల్ల కల్యాణకట్ట ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. వర్షం కొనసాగితే.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సివస్తుందని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు.
పెరిగిన గోదావరి నీటిమట్టం.. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గోదావరి నది నీటిమట్టం వరుస వర్షాల వల్ల వేగంగా పెరుగుతున్నది. నీటిమట్టం క్రమంగా పెరగడాన్ని గమనించిన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పెరిగిన గోదావరి నీటిమట్టం.. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు!