భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరద నీరు ఉద్ధృతంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి గోదావరి నదిలో కలవడం వల్ల నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. మంగళవారం సాయంత్రం 36 అడుగులు ఉన్న ప్రవాహం.. ఈ రోజు ఉదయానికి 41 అడుగులకు చేరింది. గోదావరిలో నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలంలోని స్నానాలఘాట్ వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం 41అడుగుల ఉన్న నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి
భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 36 అడుగులు ఉన్న నీటిమట్టం.. ఈ రోజు ఉదయానికి 41 అడుగులకు చేరింది.
గోదావరి ఉద్ధృతి