తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమ శాఖే పునాది.. గిరిపుత్రులకు ఉపాధి

అడవుల నుంచే లభించే ఉత్పత్తులే వారికి జీవనోపాధి.. సమాజానికి దూరంగా ఉంటూ ప్రకృతి ఒడిలో నివాసముంటూ అనేక ఆర్థిక ఇబ్బందులెదుర్కుంటున్న వారి అభివృద్ధే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ ముందుకొచ్చింది. ఇటీవల రసాయనాలు లేని సౌందర్య ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరగడం వల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో సబ్బులు, శాంపులు తయారుచేయడాన్ని గిరిజన మహిళలకు నేర్పించి వారికి ఆదాయ మార్గాన్ని చూపించింది.

girijana people empowerment in bhadradri kothagudem
సంక్షేమ శాఖే పునాది.. గిరిపుత్రులకు ఉపాధి

By

Published : Jan 18, 2020, 10:54 AM IST

ప్రకృతిని అవపోసన పోసుకుని.. అడవుల ఉత్పత్తులే జీవనంగా జీవిస్తున్న ఆదివాసీలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని దూరం చేస్తూ గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించి... వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజన సహకార సంస్థ ప్రాంగణంలో రూ.25 లక్షల పెట్టుబడితో దమ్మక్క లియబులటీ అనే సబ్బులు, షాంపుల కంపెనీ ప్రారంభించారు.
ప్రకృతి సిద్ధం.. ఆరోగ్యకరం అన్న నినాదమే లక్ష్యం
ఇక్కడ ఎంతోమంది గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆసక్తి ఉన్న వారికీ హైదరాబాద్​లో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం ఆరు రకాలైన కలబంద, నారింజ, బొప్పాయి, వేప, తేనె, తులసిలతో సబ్బులు.. కలబంద శాంపులు తయారు చేస్తున్నారు. వీటిని గిరిజన సంక్షేమ శాఖ ద్వారానే ఆశ్రమ పాఠశాలలకు అందిస్తున్నారు. ఆర్డర్​పై మార్కెట్లోనూ అమ్ముతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే లభించడం వల్ల గిరాకీ బాగానే ఉంది.
గిరిజనులను సమానంగా చూడటంతో పాటు వారికి అన్ని రంగాల్లోనూ అవకాశం కల్పించేందుకు ఆ శాఖ అధికారులు చేస్తున్న కృషిని అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని గిరిపుత్రులు కోరుతున్నారు.

సంక్షేమ శాఖే పునాది.. గిరిపుత్రులకు ఉపాధి

ABOUT THE AUTHOR

...view details