భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 44.5 అడుగులకు చేరింది. నిన్న ఉదయం 48 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ నిన్న సాయంత్రానికి 47 అడుగులకు చేరింది. ఈరోజు ఉదయం 6:30 గంటలకు 44.5 అడుగులకు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ అధికారులు మాత్రం గోదావరి నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
భద్రాచలంలో తగ్గుతోన్న గోదావరి నీటిమట్టం
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గడం వల్ల భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. నిన్న ఉదయం 48 అడుగులకు తగ్గిన నీటిమట్టం, ఈ రోజు ఉదయం 6:30 గంటలకు 44.5 అడుగులకు చేరింది.
భద్రాచలంలో తగ్గుతోన్న గోదావరి నీటిమట్టం