జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదురుగా ఉద్యోగులు నిరసన తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ కొరతను నివారించేందుకు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదని, క్షమాపణలు చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యుత్ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ముందు ఉద్యోగుల నిరసన
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదురుగా విద్యుత్ ఉద్యోగులు బైఠాయించారు.
వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : విద్యుత్ ఉద్యోగులు