ఆదివారం సెలవుదినం కావడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. సీతాసమేత రాముల వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కానీ సులువుగానే రామయ్య దర్శన భాగ్యం కలిగింది. కానీ ఆలయంలోని ప్రసాదాల కౌంటర్ వద్ద మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రసాదాలు ఆలస్యంగా విక్రయిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దైవ దర్శనం తొందరగా అయిపోయినప్పటికీ ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రసాదాలు తీసుకునే సమయంలో గంటల కొద్దీ వేచి ఉండాల్సివస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ.. ప్రసాదాల కోసం అవస్థలు.! - devotees rush in bhadradri temple
ఏ గుడికి వెళ్లినా దైవ దర్శనం తర్వాత భక్తులు ఆశగా ఎదురుచూసేది ప్రసాదం కోసమే. అందులో ఉండే రుచే వేరు. ప్రసాదం తీసుకోకుండా తిరుగుప్రయాణమైతే అదో వెలితి. అందుకే గంటల తరబడి వేచి ఉండైనా తీసుకునే వెళ్తారు. కానీ భద్రాద్రి రామయ్య సన్నిధిలో మాత్రం ప్రసాదం దక్కాలంటే ఎన్ని గంటలైనా వేచి ఉండాల్సిందే. సరైన సదుపాయాలు లేక ఎండలో చిన్నపిల్లలతో చెమటలు కక్కుతూ నిలబడాల్సిందే. ఈ రోజు ఆదివారం కావడంతో ప్రసాదాల కోసం భక్తుల అవస్థలు ఇంకా పెరిగాయి.
భద్రాద్రిలో భక్తుల రద్దీ
కాగా ఈ విషయంపై కొందరు భక్తులు ఆలయ ఈవో శివాజీకి ఫిర్యాదు చేశారు. చాలా రోజుల నుంచి ప్రసాదాల కౌంటర్ వద్ద ఫ్యాన్లు పనిచేయడం లేదని పేర్కొన్నారు. దీంతో చిన్న పిల్లలతో గంటల కొద్దీ క్యూలో నిలబడి అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. దీంతో ప్రసాదం అందేసరికి ఆలస్యమవుతోందని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి:Alai-Balai 2021: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు