భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలోని శ్రీ లక్ష్మీ తాయారమ్మ ఉపాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎనిమిదవ రోజైన నేడు శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు ఆదివారం కావడం వల్ల ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం, బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రతి రోజు జరిగే నిత్య కళ్యాణంలో ఉభయ దాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వీరలక్ష్మీ అలంకారంలో తాయారమ్మ దర్శనం - భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ లక్ష్మీ తాయారమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వీరలక్ష్మీ అలంకారంలో తాయారమ్మ దర్శనం