CRPF Jawans Republic Celebrations With Tribals: తెలంగాణ- ఛత్తీస్ఘఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నిన్న 74వ గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని లేఖ విడుదల చేయడంతో.. నేడు సీఆర్పీఎఫ్ జవానులు గిరిజనులతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరూ ఆడిపాడి అలరించారు. గిరిజనులతో కలిసి ఆడుతూపాడుతూ ఎంతో ఉత్సాహంగా జవానులు గడిపారు.
తెలంగాణ సరిహద్దులో ఉన్న చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కిష్టారంతో పాటు.. వివిధ క్యాంపులలో ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు.. అక్కడి గిరిజనులతో కలిసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. గిరిజనులతో పాటు సీఆర్పీఎఫ్ జవానులు వారి సాంప్రదాయం నృత్యాలు చేసి.. గిరిజనులతో పాటు సహ పంక్తి భోజనాలు చేశారు. జవానులు వైద్య బృందాన్ని తీసుకెళ్లి గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు చేసి.. మందులను పంపిణీ చేశారు. గిరిజన యువకులకు పండ్లును అందించారు.