Devotees in Bhadrachalam: రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి.
భద్రాద్రిలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు.. నేడు ప్రత్యేకత ఏంటంటే..!
Devotees in Bhadrachalam: దక్షిణ ఆయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు వేడుకల్లో ఏడో రోజైన నేడు.. భద్రాచలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Bhadrachalam Temple
ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలలో ఏడో రోజైన నేడు.. భద్రాచలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వేడుక నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
- భద్రాద్రి రామాలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
- యాదాద్రికి దక్కిన మరో ఘనత.. ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రంగా ఎంపిక
- ఆకట్టుకుంటున్న 'పెట్ కార్నివాల్'.. తిలకించేందుకు తరలివచ్చిన నగరవాసులు