తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లెందులో కేటీఆర్ తీరుపై న్యూడెమోక్రసీ అభ్యంతరం

ఇల్లెందు పర్యటనలో మంత్రి కేటీఆర్​ వినతిపత్రాలు తీసుకోకపోవడంపై న్యూడెమోక్రసీ నాయకులు మండిపడ్డారు. పోడు భూముల సమస్య ప్రశ్నిస్తున్నామనే తమ రిప్రజెంటేషన్ నిరాకరించారని దుయ్యబట్టారు.

cpiml leaders fire on ktr his behaviour in ellandhu
ఇల్లందులో కేటీఆర్ తీరుపై న్యూడెమేక్రసీ అభ్యంతరం

By

Published : Mar 2, 2020, 11:54 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంత్రి కేటీఆర్ తీరుపై న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకుల వినతి పత్రాలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పోడు భూముల సమస్య ప్రశ్నిస్తున్నామనే న్యూడెమోక్రసీ నేతల రిప్రజెంటేషన్ నిరాకరించారని దుయ్యబట్టారు.

మిట్టపల్లిలో అధికార పార్టీ నేతలు అధికారులతో కలిసి అడవి నరికేస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను వేధిస్తున్న నేతలకు అటవీ అధికారులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్పందించకుంటే జిల్లా కలెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

ఇల్లెందులో కేటీఆర్ తీరుపై న్యూడెమోక్రసీ అభ్యంతరం

ఇదీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details