తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రిలో వ్యాక్సినేషన్.. పుష్పలతకు తొలి వ్యాక్సిన్! - వైద్యసిబ్బందికి కరోనా టీకా పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జేసీ వెంకటేశ్వర్లు కలిసి ప్రారంభించారు. మొదటి రోజు 30 మంది వైద్య సిబ్బందికి టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ​

భద్రాద్రిలో వ్యాక్సినేషన్.. పుష్పలతకు తొలి వ్యాక్సిన్!
covid-vaccine-distribution-in-bhadradri-kothagudem-district-bhadrachalam-to-medical-staff

By

Published : Jan 16, 2021, 5:40 PM IST

భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మంది వైద్య సిబ్బందికి మొదటి విడతలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తొలి టీకాను ఆస్పత్రి స్టాఫ్​నర్స్​ పుష్పలతకు వేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జేసీ వెంకటేశ్వర్లు సంయుక్తంగా ప్రారంభించారు.

అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​​ యుగంధర్​, వైద్యులు కూడా వ్యాక్సిన్​ తీసుకున్నారు. తర్వాత ఎలాంటి దుష్పరిణామాలు కనిపించలేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్​ ఇచ్చిన వారిని అరగంటసేపు పర్యవేక్షణలో ఉంచారు. ప్రభుత్వం తమకు ప్రాధాన్యం కల్పించి టీకా ఇవ్వడం సంతోషంగా ఉందని స్టాఫ్​నర్స్​ పుష్పలత అన్నారు. మొదటి విడతలోనే వ్యాక్సిన్​ తీసుకోవడం ఆనందంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ అన్నారు.

వ్యాక్సినేషన్ వేళ మావోయిస్టుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఏజెన్సీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి :కొవిడ్ వ్యాక్సిన్​తో మహమ్మారి నుంచి విముక్తి : మంత్రి వేముల

ABOUT THE AUTHOR

...view details