సింగరేణి ప్రాంతాల్లోనూ కరోనా కేసులు విజృంభిస్తుండడం వల్ల సంస్థ అప్రమత్తమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కరోనా పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించగా... మొదటిరోజు నలుగురికి, రెండోరోజు ఏడుగురికి మొత్తం 11 మందికి కరోనా నిర్ధారణ చేశారు. ఇందులో జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది, కార్మిక కుటుంబ సభ్యులు, కార్మికులు ఉన్నారు.
పరీక్షలు జరుగుతున్న తీరును ఏరియా జనరల్ మేనేజర్ సత్యనారాయణ, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కార్మికులు ఎవరు అధైర్య పడవద్దని 20 ఐసోలేషన్, 20 క్వారంటైన్ బెడ్లతో ఏర్పాట్లు చేశామని తెలిపారు.
సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు - corona tests
సింగరేణి ప్రాంతాల్లోనూ రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. ఇల్లందులో మంగళవారం కరోనా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించగా... ఇప్పటివరకు 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.
సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు