తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తగూడెంలో జంట సజీవదహనం..! - జంట ఆత్మహత్య

మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట సజీవ దహనమయ్యారు. కొత్తగూడెం పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

జంట సజీవ దహనం

By

Published : Mar 18, 2019, 9:53 AM IST

Updated : Mar 18, 2019, 11:44 AM IST

ఘటనా స్థలంలో విచారణ చేస్తున్న పోలీసులు
కొత్తగూడెం పట్టణం రామాంజనేయ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న వినోద్, తేజస్విని మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు... ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

ఇంట్లో యువ జంట మృతదేహాలు

ఇంట్లోకెళ్లిన పోలీసులకు లోపల... యువ జంట మృతదేహాలు కనిపించాయి. చనిపోయిన వినోద్ పాత నేరస్థుడిగా గుర్తించారు. ఎప్పుడూ సైకోలా ప్రవర్తిస్తాడని స్థానికులు తెలిపారు. రాత్రి ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి పెట్రోల్ పోసి నిప్పంటించి ఇద్దరు కాలి చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి :యాదాద్రి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

Last Updated : Mar 18, 2019, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details