తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు - si

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు కాకుండా... అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారనే కోణంలో భద్రాచలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏఎస్పీతో పాటు సుమారు 50 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్​ జవాన్లు పాల్గొన్నారు.

పోలీసుల నిర్బంధ తనిఖీలు

By

Published : Apr 4, 2019, 10:19 AM IST

పోలీసుల నిర్బంధ తనిఖీలు
భద్రాచలంలోని సుభాష్ నగర్​లో భద్రాద్రి జిల్లా ఏఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే చెప్పాలని సూచించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను పోలీస్​లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఏఎస్పీ రాజేష్ చంద్ర, సీఐ సత్యనారాయణ రెడ్డి, 50 మందికి పైగా పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details