రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పెరిగిన ధరలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఉన్నపెట్రోల్ బంకు ఎదుట ఆందోళనకు దిగారు.
'ఓవైపు నిత్యావసరాల ధరలు.. మరోవైపు పెట్రో మంటలు' - తెలంగాణ వార్తలు
పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ భద్రాచలంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. కరోనా సమయంలో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఓవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు పెట్రో మంటలతో సతమతమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ధర్నా, పెరిగిన పెట్రోల్ ధరలు
కరోనా కాలంలో ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు... మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పేదల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం వెంటనే స్పందించి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షుడు చింత్రియాల సుధీర్, కాంగ్రెస్ నాయకులు ఎడారి ప్రదీప్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు