భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ - భద్రాద్రి
వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో భద్రాచలం కిటకిటలాడుతోంది. రామయ్యను దర్శించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. నాలుగు రోజులు సెలవులు రావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. దేవాలయ అధికారులు ఈ నెల 10 నుంచి 15 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు అంతరాలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు.