తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏజెన్సీ ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కలవరం.. ఇద్దరిలో లక్షణాలు! - తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గుండాల మండలంలో ఒకరికి బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయింది. ఇల్లందు మండలంలో మరొకరిలోనూ అలాంటి లక్షణాలే కనిపించాయి. కరోనా పాజిటివ్ రాకపోయినా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయని స్థానిక వైద్యులు అంటున్నారు.

fungus
fungus

By

Published : Jun 7, 2021, 7:54 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన మత ప్రబోధకుడు రాజుకు నెల రోజుల క్రితం కొవిడ్ సోకి కోలుకున్నాడు. ఇటీవల మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. కంటి నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇల్లందు మండలంలో మరోవ్యక్తిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. లాల్ సింగ్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా తీవ్ర పంటి నొప్పితో బాధపడుతూ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందాడు. ఇటీవల కంటి నొప్పి రావడంతో గ్రామంలోని ఏఎన్ఎంను సంప్రదించాడు. కరోనా పరీక్షల్లో నెగెటిల్​ వచ్చింది.

కంటిని పరీక్షించిన వైద్యుడు మెరుగైన చికిత్స చేయించుకోవాలని సూచించడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. పంటి నొప్పి, కంటి నొప్పికి తోడు ముక్కు రంధ్రం ఒక వైపు మూసుకుపోయి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. వెంటనే హైదరాబాద్​కు వెళ్లాలని స్థానిక వైద్యుడు సూచించారు. మెరుగైన చికిత్స కోసం బాధితుడు హైదరాబాద్​కు బయలుదేరాడు.

ఇదీ చదవండి:GDP: ఆర్థిక వ్యవస్థ పరుగుకు అడ్డుకట్ట... మైనస్​లోకి జీడీపీ

ABOUT THE AUTHOR

...view details