తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫామ్‌హౌస్‌ను వదిలి ఎందుకు బయటికి రారు.?: బండి సంజయ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

bandi sanjay, mlc elections
బండి సంజయ్‌, ఎమ్మెల్సీ ఎన్నికలు

By

Published : Mar 8, 2021, 5:18 PM IST

సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వంగి వంగి నమస్కరించిన కేసీఆర్‌.. ఇప్పుడు ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావడం లేదని.. ఏం జరిగిందో తెలియాల్సి ఉందని ఎద్దేవా చేశారు. జాతి పండుగలను, సంస్కృతీ సంప్రదాయాలను తెరాస మంట కలుపుతోందని ఆగ్రహించారు.

వరంగల్‌, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి గెలుపు కోరుతూ భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పాలన‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

తెరాస రాక్షస పాలన

ప్రజల పక్షాన పోరాడుతున్న భాజపాను.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి తెరాస రాక్షస పాలనకు బుద్ధి చెప్పాల్సిందిగా ఆయన కోరారు. సమ్మేళన సభకు ముందుగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కుంజా సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మహిళలు రాణించడానికి కాంగ్రెస్​ విధానాలే కారణం: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details