ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు అయినందున వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు భద్రాచలం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్దకు తరలిరావడం వల్ల ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వారిని అదుపు చేయడం ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి కష్టతరమవుతోంది. సీతారాములను దర్శించుకోవాలంటే గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఆదివారం లాగానే ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. నిత్య కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భద్రాచలం రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ - RAMAYYA
భద్రాద్రి రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది.
భద్రాచలం రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ