భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇవాళ సాయంత్రం విశ్వరూప సేవ వైభవంగా జరగనుంది. దీని కోసం ఆలయ అధికారులు బేడా మండపం వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో నిర్వహించిన శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో చివరిది, పెద్దది అయిన విశ్వరూప సేవ ఘనంగా నిర్వహించనున్నారు.
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో రోజుకో అవతారంలో దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులు, ఒక్కొక్క వాహనంపై వేంచేసి ఒకేసారి భక్తులకు దర్శనం ఇస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ద్వార దర్శనం చూడకుండా ఉంటారో, విశ్వరూప సేవ రోజు ఈ ఉత్సవాన్ని చూడడం వల్ల అంతటి ఫలితం కలుగుతుందని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు.