తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం

కరోనా వైరస్​ ప్రభావం మనుషులపైనే కాదు దేవుళ్లపై కూడా పడింది. భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని హంగు ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో భక్తులు లేకుండానే రాములోరి పెళ్లి వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ స్పష్టం చేశారు. అర్చకులు, బ్రాహ్మణుల సమక్షంలో శాస్త్రోక్తంగానే కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు.

By

Published : Mar 17, 2020, 3:18 PM IST

Updated : Mar 17, 2020, 4:43 PM IST

భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం..
భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం..

భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం..

కరోనా ప్రభావం భద్రాద్రి రామయ్య కల్యాణంపైనా పడింది. కొవిడ్​-19 ప్రభావంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సారి హంగు ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా నిరాడంబరంగానే సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య సాగే రాములోరి పెళ్లి వేడుకలు చేపట్టనున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో నిర్ణయం

ఈ సారి భక్తులు లేకుండానే చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు లేకుండానే ఈసారి కల్యాణమహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్చకులు, బ్రాహ్మణుల సమక్షంలో శాస్త్రోక్తంగానే కల్యాణం జరుగుతుందని వెల్లడించారు.

పట్టు వస్త్రాలు అర్చకులే సమర్పిస్తారు:

రాములోరి కల్యాణానికి ప్రతీ ఏటా సమర్పించే పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా ఆలయ అధికారులే సమర్పిస్తారన్న మంత్రి పువ్వాడ.. ఆన్ లైన్​లో టికెట్ల విక్రయాలు నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పటికే విక్రయించిన టికెట్లకు సంబంధించి భక్తులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:వైభవంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

Last Updated : Mar 17, 2020, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details