భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇల్లందు పట్టణం, సుభాష్ నగర్, ఇందిరా నగర్ పంచాయతీలలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు సర్వేను పరిశీలించారు. నమోదు శాతం తక్కువగా ఉందని ఇల్లందు మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయేతర ఆస్తుల నమోదులో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
ఇల్లందు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు సర్వేను పరిశీలించారు. ఇల్లందు మండలంలో సర్వేలో తక్కువ శాతం నమోదు పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇల్లందు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సర్వే కోసం పట్టణంలోని 24 వార్డుల్లో 30 టీములు ఏర్పాటు చేశామని.. ప్రతిరోజు 70 ఇళ్లను సర్వే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. పట్టణంలో హరితహారం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. టేకులపల్లి మండలంలో పర్యటించి సర్వేను పకడ్బందీగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, చెత్త సేకరణ, వీధిలైట్ల వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.