తెలంగాణ

telangana

ETV Bharat / state

'లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్నందున ప్రజాప్రతినిధులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కోసం సహాయక చర్యలు చేపట్టారు. భద్రాచలంలో లోతట్టు ప్రాంతంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్​ వారికి సూచించారు. ఎమ్మెల్యేలు పునరావాస కేంద్రాలను పరిశీలించారు.

bhadradri kothagudem collector visit flood area in bhadrachalam
'లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి'

By

Published : Aug 17, 2020, 5:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతున్నందున భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలను పరిశీలించి భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీలో ప్రస్తుతం వరద నీరు చేరినందున ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పునరావాస కేంద్రాలను పరిశీలించారు. వరద బాధితులకు సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు మంచి భోజనం, వైద్య సదుపాయం, వసతి కల్పించాలని భద్రాచలం ప్రత్యేక అధికారికి సూచించారు.

భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ప్రభుత్వ విప్​, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు పునరావాసం పొందుతున్న ప్రజలకు భోజనం వడ్డించారు. వరద బాధితులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: గోదారమ్మ ఉగ్రరూపం.. వణుకుతున్న మన్యం

ABOUT THE AUTHOR

...view details