భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజపేట కాలనీలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాలమేరకు భద్రాచలం ఎస్పీ రాజేష్ చంద్ర సమక్షంలో 80 మంది సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇళ్లు తిరిగి అనుమానితుల ఆధార్ కార్డులు పరిశీలించారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు అనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భద్రాచలంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు సానుభూతిపరులు అనే అనుమానంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భద్రాచలంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు