కరోనాతో మృతిచెందిన వ్యక్తికి బీసీఆర్ ట్రస్ట్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్ల గూడెం గ్రామానికి చెందిన కండెల సమ్మయ్యకు కరోనా సోకగా.. 10 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం రాళ్లగూడెం తీసుకెళ్లేందుకు గ్రామ పెద్దను సంప్రదించగా.. కరోనా రోగి మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావద్దని ఎవరూ సహకరించరని చెప్పారు. బంధువులకు సమాచారం అందించినా ఒక్కరూ పట్టించుకోకుండా ముఖం చాటేశారు.
Corona: కరోనా మృతదేహానికి బీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు - సీపీఎం పార్టీ బీసీఆర్ ట్రస్ట్
కరోనా కష్టకాలంలో పలువురు మానవత్వాన్ని చాటుతున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులూ అంత్యక్రియలకు ముందుకు రాని పరిస్థితుల్లో వారే ఆదుకుంటున్నారు. సీపీఎం నిర్వహిస్తున్న బీసీఆర్ ట్రస్ట్ ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.
కరోనా మృతదేహానికి బీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు
ఒంటరైన భార్య సారమ్మ, కుమారుడు ఆనంద్‌లకు ఏం చేయాలో అర్థంకాక.. సీపీఎం నిర్వహిస్తున్న బీసీఆర్ ట్రస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. స్పందించిన ట్రస్ట్ సభ్యులు గడ్డం స్వామి, భీమవరపు వెంకటరెడ్డి, నకిరేకంటి నాగరాజు, న్యాయవాది పామరాజు తిరుమలరావులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సమ్మయ్య మృతదేహాన్ని భద్రాచలంలోని వైకుంఠధామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ