పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని విపక్షాలు కదం తొక్కాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ కొనసాగిస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ఐకాస ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నాయి. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. బస్సులను అడ్డుకున్నారు. ఈ బంద్‌కు వామపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు తెలిపాయి. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని నినాదాలు చేశారు.
Kothagudem Bandh: కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతున్న బంద్ - undefined
కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతున్న బంద్
08:16 January 07
కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతున్న బంద్
08:15 January 07
కొత్తగూడెం బంద్
కొత్తగూడెం నియోజకవర్గం బంద్ దృష్ట్యా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కొత్తగూడెం బంద్‌కు అనుమతి లేదంటున్న పోలీసులు... విపక్ష పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. సీపీఐ నేత శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Jan 7, 2022, 8:48 AM IST