సాధారణంగా పోలింగ్ కేంద్రాల్లోకి చరవాణి అనుమతి ఉండదు. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించడం ఎంతో ముఖ్యం. సెల్ఫీలు దిగడం నిబంధనలకు విరుద్ధం. దీనికి వ్యతిరేకంగా.. ఓటు వేసిన దృశ్యాలే ఏకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెంలోని బూర్గం పాడులో ఓటేస్తుండగా తీసిన ఫోటోలు, వీడియోలను ఓటర్లు అంతర్జాలంలో పెట్టారు. కలకలం రేపుతున్న ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్ ఓటు - బ్యాలెట్ పత్రాలు ప్రత్యక్షం
ఓటు హక్కు వినియోగం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం భద్రాద్రి కొత్తగూడెంలో కలకలం రేపింది. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
బ్యాలెట్ ఓటు