భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల సందడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు నది వద్దకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలను వదులి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒడ్డున గౌరమ్మకు, తులసి మొక్కలకు పూజలు నిర్వహిస్తున్నారు.
కార్తీకశోభ: గోదావరి తీరం... భక్తజన సంద్రం - pujalu at godavari
భద్రాద్రి తీరం భక్తజన సందోహంగా మారింది. కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో గోదావరి తీరంలో భక్తుల రాకతో కొత్తశోభను సంతరించుకుంది.
గోదావరి వద్ద కార్తిక శోభ
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గోదావరి వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి : బస్సుల్లేవ్.. బడికిపోం..!