శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ రవీందర్రెడ్డి హెచ్చరించారు. ఇల్లందు డివిజన్ పరిధిలో అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం నేపథ్యంలో ఎటువంటి ఉత్సవాలు, ర్యాలీలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో ఎటువంటి సందేశాలు పెట్టవద్దని తెలిపారు.
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో డీఎస్పీ రవీందర్రెడ్డి శాంతి సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఎటువంటి సందేశాలు పెట్టవద్దని తెలిపారు.
badradri kothagudem dsp ravinder reddy warning to people
నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రోజురోజుకు మండలంలో విస్తృతమవుతున్న కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని... గుంపులు గుంపులుగా సమూహంగా ఉండకూడదని కోరారు.