'48 అడుగులకు చేరితే రెండో హెచ్చరిక జారీ చేస్తాం' - రజత్ కుమార్ సైనీ
గోదావరిలో వరద నీరు వేగంగా పెరగడం వల్ల ఈరోజు ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ కరకట్ట వద్ద గల ప్రాంతాలను పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 45 అడుగుల వరకు చేరింది. కరకట్ట ప్రాంతాలను కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ పరిశీలించారు. వరద ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. గోదావరి వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు.
- ఇదీ చూడండి : సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తాం: కేటీఆర్