భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకలపల్లికి చెందిన కారం కాంతమ్మ ప్రసవం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ప్రసవం అయిన అరగంటకే ఆడ శిశువు అదృశ్యమైంది. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా భద్రాచలం ఏఎస్పీ రాజేంద్ర ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు పాప ఆచూకీ తెలుసుకున్నారు.
సుఖాంతమైన శిశువు అదృశ్యం కథ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అదృశ్యమైన ఆడ శిశువు ఆచూకీ లభ్యమైంది. పాపను మణుగూరులోని సంతోష్‌నగర్ కాలనీకి చెందిన కోమటిశెట్టి కృష్ణవేణి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
సుఖాంతమైన శిశువు అదృశ్యం కథ
మణుగూరులోని సంతోష్‌నగర్ కాలనీకి చెందిన కోమటిశెట్టి కృష్ణవేణి పాపను ఎత్తుకెళ్లినట్లు ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. శిశువును తల్లికి అప్పగించినట్లు చెప్పారు. నిందితురాలు ఎందుకు ఎత్తుకెళ్లిందో విచారణ చేస్తున్నామన్నారు. పాప తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి:కిస్కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్‌కా బీ నహీ: భట్టీ