భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. నెలరోజుల నుంచి జీతాలు లేకుండా సమ్మె చేస్తున్న కార్మికుల ఆర్థిక ఇబ్బందులు గుర్తించి వారి కోసం విరాళాలు సేకరించారు. బియ్యం, నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులకు పంపిణీ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు ఆర్థిక సాయం - tsrtc employees strike 2019
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పలువురు ప్రముఖులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపి వారికి నిత్యావసర సరుకులు అందించారు.
భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులకు ఆర్థిక సాయం
పట్టణానికి చెందిన పాకాల దుర్గాప్రసాద్ నిత్యావసర సరుకుల నిమిత్తం రూ.40 వేల నగదు అందజేసి, కందిపప్పు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ కంభంపాటి సురేశ్, తెదేపా నేతలు అజీమ్, సీపీఎం నాయకులు వెంకట్రెడ్డి, బాల నర్సారెడ్డి పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : '208 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు'