భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహిస్తున్నారు. గత 80 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీలో వేసిన నగదు, వెండి, బంగారం ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఆలయ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల భక్తులు కలిపి సుమారు 200 మందికిపైగా లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఆలయ ఈవో రమేష్ బాబు సమక్షంలో... సీసీ కెమెరాల నిఘాలో ఆదాయ లెక్కింపును నిర్వహిస్తున్నారు. 80 రోజుల ఆదాయం కోటికి పైగా రావచ్చునని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
రామచంద్రుని ఆదాయ లెక్కింపు ప్రక్రియ మొదలు
భద్రాచల రామచంద్రుని హుండీల లెక్కింపు ప్రక్రియను ఆలయ అధికారులు ప్రారంభించారు. సుమారు 200 మంది సిబ్బందితో సీసీ కెమెరాల నిఘా నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
BADRACHALAM HUNDI COUNTING
TAGGED:
BADRACHALAM HUNDI COUNTING